'మా' తెలంగాణగా నామకరణం చెయ్యాలి

'మా' తెలంగాణగా నామకరణం చెయ్యాలి

8వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ నటుడు సీవీఎల్ నరసింహారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మా' ప్రస్తుత కమిటీకి ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావం గురించి ఎంత చులకనగా మాట్లాడారో.. అలాగే తెలంగాణ సినీ పరిశ్రమ గురించి ఇప్పటీకీ మాట్లాడుతున్నారు. అయితే 2024 జూన్ 2కల్ల మా భవనం కడతామని చెప్పారు కట్టండి అని సీవీఎల్ అన్నారు. దానికి మా తెలంగాణ అని నామకరణం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ భవనం ఆవరణలో ప్రముఖ కళాకారులు పైడి జైరాజ్, ప్రభాకర్ రెడ్డి, కాంతారావుల విగ్రహాలు తప్పని సరిగా పెట్టాలని సూచించారు.

తెలుగు సినిమాకి సంబంధించి రెండు రాష్ట్రాలు విడిపోయాయి. రెండు రాష్ట్రాలకు రెండు సినిమా విభాగాలు వుండాలి అన్నారు. మే1న కార్మికుల పండుగ తెలంగాణకి పరిమితం అయ్యింది ఆంధ్రలో చేశారో లేదో తెలీదు..ఇకనుంచి తెలంగాణకు సంబంధించి వివక్ష కుదరదు.. అది మా బిల్డింగ్ నుంచే మొదలవుతుందని సీవీఎల్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో వుండి సినిమాలు తీస్తున్న ఆంధ్ర నిర్మాతలకు నటుడు సీవీఎల్ కృతజ్ఞతలు తెలిపారు.