- యాప్ ఆవిష్కరించిన నిర్వాహకులు
పంజాగుట్ట, వెలుగు: సర్కారు ఫోన్ నంబర్లు కావాలా? చిటికెలో అన్ని రకాల సమాచారం అందుబాటులోకి తీసుకువచ్చింది యూ రూల్ టెలిఫోన్ డైరెక్టరీ. ఇందుకు సంబంధించిన యాప్ను శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యూ రూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిమల్ల గోవర్దన్ తన సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారుల సమాచారం, వివిధ పథకాలకు సంబంధించిన వివరాలు, ఉన్నతాధికారుల వివరాలతో కూడిన యాప్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో యూ రూల్ టెక్నాలజీ అధికారి రాణి, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
