
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రిలోని బి-1 కాంగ్రెస్ క్యాంప్‌ఆఫీస్, పాతబస్టాండ్ఏరియాలో శనివారం యూత్కాంగ్రెస్ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపేతానికి యూత్ కాంగ్రెస్ కృషి చేస్తోందని తెలిపారు. 65 ఏళ్లుగా ప్రతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సారథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ నోముల రాజేందర్‌గౌడ్, మందమర్రి మండల యూత్‌వైస్ ప్రెసిడెంట్ మాయ తిరుపతి, నాయకులు అకారం రమేశ్, రాయబారపు కిరణ్, జావిద్‌ఖాన్, చిప్పకుర్తి శశిధర్, చెన్నూరు నియోజకవర్గ జనరల్ సెక్రటరీ నేరటి వెంకటేశ్, మండల జనరల్ సెక్రటరీ బియ్యపు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.