అఖండ ఓ మహర్జాతకుడు

అఖండ ఓ మహర్జాతకుడు

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌‌లో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ’. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై మిర్యాల రవీందర్‌‌‌‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్‌‌‌‌ 2న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రవీందర్‌‌‌‌రెడ్డి ఇలా ముచ్చటించారు. 

‘‘అన్‌‌స్టాపబుల్‌‌గా గర్జించబోతున్నాడు ‘అఖండ’. ఇందులో బాలకృష్ణ గారివి  రెండు పాత్రలు అని చూడకూడదు. ఎందుకంటే ఆ రెండో పాత్రయిన అఘోరా మనిషికి ఎక్కువ దేవుడికి తక్కువైన ఓ సూపర్ హీరో. సినిమా మొలైన పదిహేను నిమిషాల తర్వాత ప్రేక్షకులు స్క్రీన్‌‌ని మాత్రమే చూస్తుండిపోతారు. అలాంటి ఓ విజువల్‌‌ వండర్‌‌ ఇది. ‘లెజెండ్‌‌’ టైమ్‌‌లోనే ‘మహర్జాతకుడు’ అనే వర్కింగ్‌‌ టైటిల్‌‌తో బాలకృష్ణకి కథ చెప్పారు బోయపాటి. ఆ కథతోనే 2019 డిసెంబర్‌‌‌‌లో ఈమూవీ స్టార్ట్ చేశాం. ఓ సాంగ్, క్లైమాక్స్ పార్ట్ తప్ప షూటింగ్ అంతా సెకెండ్‌‌ లాక్‌‌డౌన్‌‌కి ముందే కంప్లీట్ అయింది. రిలీజ్‌‌కి పరిస్థితులు అనుకూలించలేదు. ఓటీటీ ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ ఈ రేంజ్‌‌ సినిమాని బిగ్‌‌ స్క్రీన్‌‌పై చూస్తేనే కరెక్ట్ అనిపించి డిసెంబర్‌‌‌‌ 24న రావాలనుకున్నాం. ఇదే విషయం డిస్ట్రిబ్యూటర్స్‌‌తో చర్చిస్తే  డిసెంబర్‌‌‌‌ 2న రిలీజ్ చేయడం కరెక్ట్ అన్నారు. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పూర్వవైభవం వస్తుందనుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్స్‌‌లో రాబోతోంది. ఓవర్సీస్‌‌లోనూ భారీ స్థాయిలో విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ని భారీగా ప్లాన్ చేసినా,  బాలకృష్ణ గారికి  చిన్న సర్జరీ జరగడంతో ఆ నిర్ణయం మార్చుకుని, శిల్పకళావేదికలో చేస్తున్నాం. ఏ సినిమాకైనా స్టోరీనే ఇంపార్టెంట్‌‌ అని నమ్ముతాను. కానీ స్టార్‌‌‌‌డమ్ ఉన్న హీరోలకు మాత్రం కథ అనేది ఓ లైన్‌‌గా ఉంటే చాలు. మిగతాదంతా హీరోలు క్యారీ చేస్తారు. ప్రస్తుతం రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’.