అక్రమాల టానిక్... పన్నీరు వారి పాల దందా ముచ్చట ఎందుకు కనుమరుగైంది?

అక్రమాల టానిక్... పన్నీరు వారి పాల దందా ముచ్చట ఎందుకు కనుమరుగైంది?
  • బీఆర్​ఎస్​ కీలక నేతలే టార్గెట్​గా ‘కవితక్క అప్ డేట్స్’​ ట్వీట్ 

హైదరాబాద్ , వెలుగు: ఈ మధ్య ‘కవితక్క అప్ డేట్స్’ పేరుతో వస్తున్న ట్వీట్లు రాజకీయాల్లో తీవ్ర దుమారంరేపుతున్నాయి. బీఆర్ఎస్ కీలక నేతలే టార్గెట్​గా  ఇం దులో తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. ఈ ట్విట్టర్ (ఎక్స్​)​ హ్యాండిల్​ను కవిత అనుచ రులే నడిపిస్తున్నారని బీఆర్​ఎస్​ నేతలు అంటున్నారు. ‘‘అక్రమాల టానిక్.. పన్నీరు వారి పాల దందా  ముచ్చట ఎందుకు కనుమరుగైంది” అంటూ తాజా ట్వీట్​లో ఉంది. 

‘‘టానిక్​..: ఒక స్పెషల్ జీవో  తెచ్చుకొ ని తోణిక్ అనే ఒక సంస్థ స్థాపించి వందల కోట్ల కొల్ల గొట్టడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాడు.. అయితే, ఆ వైన్ షాప్ చేస్తున్న తప్పిదాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల ముందు పెట్టి వాళ్లు చేస్తున్న స్కామ్​ను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. 

తోణిక్ సంస్థ జీఎస్టీ ఎగ్గొడుతుందని తెలుసుకొని లోతుగా దర్యాప్తు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సెంట్రల్ జీఎస్టీ కూడా వీటిపైనా ఆరాతీసింది.. కానీ, అక్కడ సెంట్రల్​కి ఎటువంటి సమాచారం దొరక లేదు. ఈ ప్రక్రియలో ఒక నిజాయితీ గల జీఎస్టీ ఆఫీసర్ బలి అయ్యాడు. అప్పటివరకు హడావుడి చేసిన మీడియా, సోషల్ మీడియా తర్వాత ఎటువంటి సమాచారాన్ని బయటపెట్టలేదు.  హ్యాపీ రావు కర్నాటక ‘డి’ ఒక పెద్ద మనిషిని హోటల్​లో కలిసి ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఇక.. దళితులను ముంచిన పన్నీరువారి పాలవ్యాపారం.. ఏమిటంటే!  ఒక సామాన్య వ్యక్తి పాల వ్యాపారం చేస్తే అతను నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాలి. 

కానీ, కంపెనీ పెట్టగానే లాభాల్లోకి పోవడం మనం ఈ సంస్థ లో చూస్తాం..  ప్రభుత్వానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ  గురుకులాలు ఇతర సంస్ధల్లో వాటిల్లో తన అధికారం ఉపయోగించి తన పాలే ఉండేలా చూసుకున్నారు మన సిద్దిపేట మోడల్.  అటువంటి ప్రభుత్వ సంస్థల్లో బడుగు బలహీ న వర్గాలకు సంబందించిన ఎంట్రప్రెన్యూర్స్​ని  ప్రోత్సహించాలి కానీ అలా జరగలేదు. అధికారాన్ని వాడు కొని తన సొంత సంస్థకు లాభం చేకూరేలా చేసుకున్నాడు మన అగ్గిపెట్ట మచ్చ.  ఆ కంపెనీ మీద ఒక క్యూ యూట్యూబ్ ఛానల్ అనేక కథనాలు నడిపి సెటిల్మెంట్ చేసుకుంది. ఆ కంపెనీలో కేవలం పాల వ్యాపారం కాకుండా ఎమ్మెలేలు ట్రేడింగ్ వ్యాపారం కూడా జరిగింది. 

కేవలం పార్టీ ఇచ్చిన ఫండింగ్ కాకుండా తన సొంత పైసలు 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు ఇచ్చి అవసరం అయితే  తనతో బయటికి  రావాలని ఒప్పందం చేసుకున్నాడు” అని ‘కవిత అప్​డేట్స్’​ ట్విట్టర్​ హ్యాండిల్​లో ఉంది. ‘‘హ్యాపీ రావు, అగ్గిపెట్టె మచ్చపై.. గద్దెనెక్కినంక కొన్ని రోజులు ఇంతెత్తు ఎగిరిపడ్డ రేవంత్ ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు సైలెంట్  అయింది?  ఎందుకు వారిపై   యాక్షన్ తీసుకుంట లేదు?” అని ట్వీట్​లో ఉంది.