కేజీ వెండి రేటు కంటే తక్కువకే వస్తున్న 5 పవర్‌ఫుల్ బైక్స్.. యూత్ ఫేవరెట్స్ ఇవి..

కేజీ వెండి రేటు కంటే తక్కువకే వస్తున్న 5 పవర్‌ఫుల్ బైక్స్.. యూత్ ఫేవరెట్స్ ఇవి..

భారతీయులు వెండిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. కానీ గత ఐదేళ్లలో వెండి ధరలు పెరిగిన తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరీ ముఖ్యంగా 2025 నుంచి వెండి రేట్లకు రెక్కలు వచ్చాయనే చెప్పుకోవాలి. 2020 జనవరిలో కిలో వెండి ధర సుమారు రూ.42వేలుగా ఉండగా.. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర ఏకంగా రూ.2 లక్షల 70 వేల కంటే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఒక కిలో వెండి రేటు కంటే తక్కువ ధరకు వస్తున్న పవర్‌ఫుల్ బైక్స్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. కేటీఎం డ్యూక్ 250: 
స్ట్రీట్ ఫైటర్ బైకులలో కేటీఎం డ్యూక్ 250 ఒక ప్రత్యేకమైనది. నగర ప్రయాణాలకు, హైవే రైడింగ్‌కు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ రేటు రూ.2లక్షల12 వేలు. అంటే వెండి ధరతో పోలిస్తే మీరు దాదాపు రూ.56వేలు తగ్గింపులో పొందొచ్చు. ఈ మిగిలిన డబ్బుతో ఒక ప్రీమియం హెల్మెట్, గ్లౌవ్స్ వంటి రైడింగ్ గేర్‌ను కూడా షాపింగ్ చేయెుచ్చు.

ALSO READ : రూ.10 కోట్లు కూడబెట్టాలని ప్లాన్ చేస్తున్నారా..?

2. బజాజ్ పల్సర్ NS400Z: 
పల్సర్ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద బైక్ ఇది. సూపర్ బాడీ, పవర్‌ఫుల్ ఇంజిన్‌తో ఇది యువతను ఆకట్టుకుంటోంది. దీని ధర కేవలం రూ.లక్ష 92వేలు. వెండి ధర కంటే సుమారు రూ.80వేలు తక్కువకే ఈ పవర్‌ఫుల్ మెషిన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆ మిగిలిన మొత్తంతో వీకెండ్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

3. హీరో ఎక్స్‌పల్స్ 210: 
మీరు గానీ అడ్వెంచర్ ప్రియులైతే హీరో ఎక్స్‌పల్స్ 210 ఒక బెస్ట్ ఆప్షన్. ఆఫ్-రోడింగ్, సుదూర ప్రయాణాలకు ఇది అనువుగా ఉంటుంది. దీని ధర రూ.లక్ష 62 వేలు మాత్రమే. అంటే కిలో వెండి ధరతో పోలిస్తే లక్ష రూపాయలకు పైగా ఆదా చేసుకోవచ్చు. ఈ డబ్బుతో అడ్వెంచర్ టూరింగ్‌కు కావాల్సిన ప్యానియర్స్, బూట్స్ కూడా షాపింగ్ చేయెుచ్చు.

ALSO READ : పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

4. యమహా R15: 
స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టపడే వారికి యమహా R15 ఒక డ్రీమ్ బైక్ అని చెప్పుకోవచ్చు. రేసింగ్ ట్రాక్ అనుభూతిని ఇచ్చే ఈ బైక్ ధర రూ.లక్ష 66వేలు. వెండి రేటు కంటే ఈ బైక్ కొంటే మీకు లక్ష రూపాయల తక్కువకే వచ్చేస్తోంది. మిగిలిన మనీ ఒక రేసింగ్ జాకెట్ కొనుగోలు చేయడానికి, లేదంటే ట్రాక్ డేస్ కోసం ఖర్చు చేయడానికి సరిపోతుంది.

ALSO READ : ఈక్విటీ ఎంఎఫ్ లకు.. తగ్గిన పెట్టుబడులు..

5. కవాసాకిKLX 230: 
ప్యూర్ ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం కవాసాకి KLX 230 అద్భుతమైన ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. తేలికపాటి బరువు, మొరటుగా ఉండే డిజైన్ దీని ప్రత్యేకత. దీని ధర రూ.లక్ష 84 వేలుగా ఉంది. వెండి ధరతో పోలిస్తే ఇక్కడ కూడా  రూ.80వేలకు పైగా తక్కువకే వచ్చేస్తోంది.