- గత నెల ఆరు శాతం పతనం
న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి (ఎంఎఫ్‌లు) పెట్టుబడులు డిసెంబర్ నెలలో ఆరు శాతం తగ్గి రూ.28,054 కోట్లకు చేరాయి. నవంబర్ నెలలో ఇవి రూ.29,911 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తుల విలువ రూ.80.23 లక్షల కోట్లకు పడిపోయింది. డెట్ పథకాల నుంచి రూ.1.32 లక్షల కోట్ల భారీ ఉపసంహరణలు జరగడమే దీనికి ప్రధాన కారణం.
పెట్టుబడిదారులు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లలో రూ.10,019 కోట్ల పెట్టుబడి పెట్టారు. బంగారం ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు రూ.11,647 కోట్లకు పెరిగాయి. మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈక్విటీ విభాగంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లు కూడా రాణించాయి.
