వచ్చేవారం సంక్రాంతి పండుగ రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఈ క్రమంలో కొత్త పంటలు చేతికొచ్చినవేళ ఇంట్లో వాళ్లకు బంగారం, వెండి వండి ఆభరణాలు కొంటుంటారు. కానీ ఈ ఏడాది నిరంతరం పెరుగుతున్న రేట్లు చూస్తుంటే షాపింగ్ కలలా మిగిలిపోనుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం వీకెండ్ షాపింగ్ కోసం వెళుతున్న వారు మారిన గోల్డ్ అండ్ సిల్వర్ ధరలను పరిశీలించి ముందుకెళ్లటం మంచిది.
తెలుగు రాష్ట్రాల్లో జనవరి 10న బంగారం రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 9 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.115 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 046గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 875గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ..
ఇక వెండి విషయానికి వస్తే భారీ ర్యాలీని తిరిగి స్టార్ట్ చేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అయితే శనివారం జనవరి 10, 2025న వెండి రేటు కేజీకి రూ.11వేలు పెరిగి కొనుగోలుదారులను షాక్ కి గురిచేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 75వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.275 వద్ద ఉంది.
