
ఎవరైనసరే, ఎక్కువ జీతం ఉంటే లైఫ్ లో సెటిల్ అయినట్లే అనుకుంటారు. కానీ చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ దీనిపై కొత్త అభిప్రాయాన్ని వెల్లడించారు. నెలకు లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదించినంత మాత్రాన ఎప్పటికి ఉండే సంపదగా మారదని ఆయన అంటున్నారు. ఎవరైన ఆర్థికంగా ఎదగడానికి ఎంత సంపాదిస్తున్నారనేది కాదు, డబ్బులను ఎలా ఖర్చుపెడుతున్నారు, ఎంత పెంచుకుంటున్నారు అన్నదే ముఖ్యం అని అంటున్నారు.
కౌశిక్ తెలిపిన ప్రకారం, నెలకు రూ. 30,000 నుండి రూ. 50,000 సంపాదించే వారు కూడా సరైన ఆర్థిక అలవాట్లను పాటిస్తే మీ లక్ష్యాలను చేరుకోవచ్చు. ఎంత వస్తుంది అనేది కాదు, ఎంత మిగిలింది, ఆ మిగిలిన డబ్బుతో ఏం చేస్తారు అనేదే ముఖ్యం అని చెప్పారు.
ఎక్కువ సంపాదించాలని దృష్టి పెట్టకుండా, సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయాలి, మిగిలిన మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం అని కౌశిక్ చెబుతున్నారు. SIPలు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్) వంటి వాటి ద్వారా చిన్న మొత్తాలను కూడా పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయాలనీ సలహా ఇస్తున్నారు. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడితే, చిన్న మొత్తం డబ్బు కూడా కాంపౌండింగ్(చక్రవడ్డీ) శక్తి వల్ల పెద్ద మొత్తంగా మారుతుందని ఆయన అన్నారు.
ఏదైనా పెట్టుబడి పెడితే వెంటనే ఫలితాలు(returns) ఆశించవద్దని, కొంతకాలం పాటు ఓపికగా ఉండాలని కోరాడు. మార్కెట్ పెరుగుదల కోసం చూడటం లేదా పెట్టుబడులు పెట్టేందుకు ఆలస్యం చేయడం కంటే లాంగ్ టర్మ్ స్థిరత్వంపై దృష్టి పెట్టడం మంచిది.
సాధారణంగా చేసే పొరపాట్లు అంటే ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ లేదా స్టాక్ మార్కెట్ అంచనాలతో పెట్టుబడులు వంటి ప్రలోభాలకు దూరంగా ఉండాలి అన్నారు. చాలా మంది తక్కువకాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో సంపాదించిన దానికంటే ఎక్కువ నష్టపోతున్నారని కౌశిక్ గుర్తించారు. ఆయన ప్రకారం, నిజమైన సంపద నిశ్శబ్దంగా, పద్ధతిగా పెరుగుతుంది.
కౌశిక్ సందేశం ముగింపులో, ఆకస్మిక కొనుగోళ్లు మరియు ఊహించని ఆదాయ పెరుగుదల ఆర్థిక భద్రతకు సమానం కాదని గుర్తుచేసాడు. బదులుగా, నెల నెలా పొదుపు మరియు పెట్టుబడి పెట్టే అలవాటు శాశ్వత సంపదను సృష్టిస్తుంది. వ్యక్తిగత ఆర్థిక రంగంలో , స్థిరత్వం ఆకర్షణ లేదా సత్వరమార్గాల కంటే చాలా ముఖ్యమైనదని ఆయన నొక్కి చెప్పారు.
నితిన్ కౌశిక్ చివరగా ఊహించని కొనుగోళ్లు లేదా ఆదాయం పెరుగుదల ఆర్థికంగా భద్రత ఇవ్వలేవని గుర్తుచేశారు. దీనికి బదులు ప్రతి నెల సేవింగ్స్ చేయడం, పెట్టుబడి పెట్టే అలవాటు శాశ్వతంగా ఉండే సంపదను పుట్టిస్తుంది.