టెర్రర్ హబ్ గా మారుతున్న దక్షిణాసియా

టెర్రర్ హబ్ గా మారుతున్న దక్షిణాసియా

దక్షిణాసియా 48 ఏళ్లుగా టెర్రరిస్టు హబ్ గా మారుతోంది. శ్రీలంకలో తాజా ఉగ్రవాద దాడి సౌత్ ఆసియాలో టెర్రరిజం పెరుగుదలను సూచిస్తోంది.2017లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో 31 శాతం దక్షిణాసియాలో నమోదైనవే.వీటిల్లో మరణించిన వారిలో 29 శాతం మంది ఇక్కడివారే. శ్రీలంకలో జరిగిన దాడి గత 15 ఏళ్లలో అతిపెద్దది. 290 మంది చనిపోగా.. 500 మందికిపైగా గాయపడ్డారు . 2008లో ముంబై దాడుల్లో 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 2014లో పాకిస్థాన్​లోనిపెషావర్ లో ఆర్మీ స్కూల్​పై జరిగిన దాడిలో 150 మందికిపైగా స్కూలు పిల్లలు బలై పోయారు. ఈ ఏడాదిఫిబ్రవరి 14లో జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా టెర్రర్ అటాక్ లో 40 మంది భారత సైనికులు చనిపోయారు.ఇవే కాదు సౌత్‌‌‌‌ ఆసియాలో తరచుగా జరుగుతున్నదాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు .

గ్లోబల్​ టెర్రర్ డాటాబేస్(జీటీడీ) గణాంకాల ప్రకారం..1970 నుంచి 2017 వరకూ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడులను పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఎక్కువ దాడులు జరిగిన ప్రాంతాల్లో సౌత్ ఆసియా రెండో స్థానంలో ఉంది. 48 ఏళ్ల(1970–2017)లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన దాడులు 1,80,000.ఈ కాలంలో అతి ఎక్కువ టెర్రర్ అటాక్స్​ మిడిల్​ ఈస్ట్, నార్త్​ ఆఫ్రికా(ఎంఈఎన్​ఏ), సౌత్ ఆసియాలోనే నమోదయ్యాయి. 1970ల్లో సౌత్ ఆసియా టెర్రర్ఫ్రీ రీజియన్. తర్వాత కాలంలో దాడులు పెరుగుతూవచ్చాయి. 1970లో 651 ఉగ్రవాద దాడులు జరిగితే..2014 లో 17 వేల అటాక్స్​ నమోదయ్యాయి. గత మూడేళ్లుగా టెర్రర్ అటాక్స్​ సంఖ్య తగ్గింది. 2017లో10,897 దాడులు జరిగాయి. ఇందులో 7,210(66శాతం) దాడులు ఎంఈఎన్​ఏ(3,780), సౌత్ఆసియా(3,430)లో నమోదైనవే. మృతుల పరంగా చూసినట్లయితే ఈ రెండు ప్రాంతాల్లో నమోదైనవే70 శాతం. 2017లో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడుల్లో 26,445 మంది చనిపోతే.. ఎంఈఎన్​ఏలో10,819(41 శాతం), సౌత్ ఆసియా7,664(29శాతం) మంది మరణించారు. 2002 నుంచి 2017మధ్య కాలంలో దక్షిణాసియాలో 31,959 దాడులుజరిగితే 59,229 మంది చనిపోయారు. ఎంఈఎన్​  ఈ విషయంలో ముందుంది. ఆ ప్రాంతంలో 33,126దాడుల్ లో 91,311 మంది మృతి చెందారు . గ్లోబల్​ టెర్రరిజం ఇండెక్స్​(జీటీఐ) కూడా దక్షిణాసియాలో టెర్రర్ అటాక్స్​ పెరుగుదలను సూచిస్తోంది. 2018జీటీఐ ర్యాకింగ్స్​లో ఇరాక్ మొదటి ప్లేస్ లో ఉంటే ఆఫ్ఘాన్​ రెండు, పాక్ ఐదు, ఇండియా ఏడో ర్యాంకుల్లోఉన్నాయి. 2002 నుంచి 2017 మధ్య దక్షిణాసియాలోని శ్రీలంక, నేపాల్​లో మాత్రం ఉగ్రవాదం ప్రభావం తగ్గినట్టు జీటీఐ వెల్లడించింది.