అమెరికన్ వర్సిటీలో కాల్పులు .. ఒకరు మృతి

అమెరికన్ వర్సిటీలో కాల్పులు .. ఒకరు మృతి

అల్బుకెర్క్ (యూఎస్ఏ): అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికోలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. అల్బుకెర్క్ సిటీలోని మెయిన్ క్యాంపస్ లో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు.

 క్యాంపస్ లో ఉన్న ఓ స్టూడెంట్ ను కలవడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులపై దుండగుడు కాల్పులు జరిపాడని తెలిపారు. తీవ్రమైన బుల్లెట్ గాయాలతో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే క్యాంపస్ ను అధీనంలోకి తీసుకుని సెర్చ్ చేశామని, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. అయితే, కాల్పులు జరిపిన వ్యక్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.