కోబ్రాను కొరికి చంపిన ఏడాది బుడ్డోడు..బీహార్లో వింత ఘటన

కోబ్రాను కొరికి చంపిన ఏడాది బుడ్డోడు..బీహార్లో వింత ఘటన

బీహార్లో వింత ఘటన..సాధారణంగా పాము కరిస్తే  మనుషులు చనిపోతారు..కోబ్రాలాంటి విష నాగు పాములు కరిస్తే పెద్దవారే నిమిషాల్లో చనిపోతారు..కానీ ఇక్కడ అంతా రివర్స్..ఏడాదిన్నర వయస్సున్న చిన్నోడు కోబ్రా పామును లాలి పాప్ లా నమిలేశాడు..పాము స్పాట్ డెడ్.ఈ వింతైన,నమ్మశక్యం కాని సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. 

అది బీహార్ లోని ఓ కుగ్రామం  బెట్టియా. ఆ గ్రామానికి చెందిన ఏడాదిన్నర వయసున్న గోవింద అనే బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది.. స్థానికంగా గెహువాన్ అనే పిలువబడే  కోబ్రా గోవింద దగ్గర రావాడంతో దాంతో ఆట లాడటం మొదలు పెట్టాడు..కోబ్రా బాలుడి చేతికి చుట్టుకోవడంతో విడిపించుకునే ప్రయత్నంలో దానిని నోట్లో పెట్టుకొని కొరికాడు.. ఇంకేముందు పాము అక్కడికక్కడే చనిపోయింది.. అయితే ఈఘటనలో బాలుడు గోవిందకు ఏమైందో తెలుసా..

ఈ ఘటన తర్వాత బాలుడు గోవింద  స్పృహతప్పి పడిపోయాడు.. బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు చికిత్స కోసం అతన్ని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించారు.అక్కడ నుంచి అతన్ని మెరుగైన చికిత్స కోసం బెట్టియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ,ఆసుపత్రికి (GMCH) తరలించారు.

ALSO READ | ఒడిషాలో షాకింగ్ ఘటన: ప్రభుత్వ హాస్టల్లో ఇద్దరు 10 టెన్త్ క్లాస్ అమ్మాయిలు ప్రెగ్నెంట్

‘‘గోవింద ఇంటి బయట ఆడుకుంటుండగా గెహువాన్ (కోబ్రాను స్థానిక పదం ) అతని దగ్గరకు వచ్చింది.  ఆశ్చర్యకరంగా బాలుడు పామును నోట్లో పెట్టుకొని కొరికాడు.  అది  అక్కడికక్కమే మరణించింది ’’ అని  గోవింద  తల్లిదండ్రులు, స్థానికులు చెప్పారు. 

GMCH వైద్యులు ఆ బాలుడు ఇప్పుడు కోలుకుంటున్నారని, అబ్జర్వేషన్ లో ఉంచామని  చెప్పారు. అయితే ఇక్కడ అద్భుతం ఏంంటంటే.. వైద్య పరీక్షలలో పిల్లవాడి శరీరంలో ఎలాంటి విషం లేదని తేలింది. 

ఈ వింతైన,మ్మశక్యం కాని సంఘటన స్థానికులను,డాక్టర్లను ఆశ్చర్యపరిచింది.చాలామంది దీనిని ఓ అద్భుతం అంటున్నారు. విషపూరిత పాముతో ఇంత ప్రమాదకరమైన ఎన్‌కౌంటర్ తర్వాత ఆ పిల్లవాడు ప్రాణాలతో బయటపడటం నిజంగా ఆశ్చర్యం. ఆ ప్రాంతంలో ఈ  ఘటన చర్చనీయాంశంగా మారింది.