లైంగికదాడి కేసులో పదిమంది అరెస్టు

లైంగికదాడి కేసులో పదిమంది అరెస్టు

మల్కాజిగిరి,వెలుగు: బాలికకు గంజాయి అలవాటు చేసి.. మత్తులో పలుమార్లు గ్యాంగ్ రేప్​చేసిన పదిమందిని నేరెడ్​మెట్​పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద ఆరు సెల్​ఫోన్లు, ఆటో, మూడు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్​మెట్​పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్​నగర్​జిల్లాకు చెందిన ఓ మహిళ కుటుంబంతో ఉపాధి కోసం  సిటీకి వచ్చి కాచిగూడలో ఉంటూ ఇండ్లలో పనులు చేస్తోంది.  

మూడేండ్ల కిందట ఆమె భర్త చనిపోగా, కూతురు(12) స్కూల్​చదువు మధ్యలోనే ఆపివేసి ఇంటి వద్దనే ఉంటోంది.  బాలిక తన ఇంటి సమీపంలోని మరో అమ్మాయి ఇంటికి వెళ్లి మాట్లాడుతుండేది. ఒక రోజు బాలిక సెల్​ఫోన్​అమ్మాయి తీసుకుని తన ఫ్రెండ్స్ నేరెడ్​మెట్​చెందిన ఆటో డ్రైవర్​చక్కోలు నరేశ్​(26), సిరిపంగ విజయ్​కుమార్ లకు కాల్ చేసింది. అనంతరం నరేష్(26) ​బాలికకు ఫోన్​చేస్తూ పరిచయం పెంచుకుని తరచూ ఇంటికి వెళ్లేవారు. 

బాలికను బైక్​పై ఎక్కించుకుని నేరెడ్​మెట్​తీసుకెళ్లేవారు. వీరు పాత నేరస్తులు కావడం, గంజాయి తాగే అలవాటు ఉండడంతో ఆమెపై లైంగికదాడికి ప్లాన్ చేశారు. బాలికకు గంజాయి అలవాటు చేసి మత్తులోకి దింపి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆపై తమ ఫ్రెండ్స్ వాగ్మారే బాలాజీ(23) , జీహెచ్ఎంసీ వర్కర్​గుడ్డంకి కృష్ణ(22), టిఫిన్​సెంటర్​వర్కర్ తొంటె కిరణ్​కుమార్​(26), అమెజాన్​డెలివరీ బాయ్​  గా బొల్లెగోపు అజయ్​(23), వాటర్​క్యాన్స్​సప్లయర్​జేమ్స్​జేవియర్(24),  మల్కాజిగిరిలో ఉండే ఇంజమూరి మధు(30), వాగ్మేరా దీపక్​(25), సబావత్​ హతియా నాయక్​(25) లకు బాలిక ఫోన్​నంబరు ఇచ్చారు.

 ఆమెకు ఫోన్ చేసి మాయమాటలతో నేరెడ్​మెట్​తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడుతుండగా, దీంతో  బాలిక ఐదు నెలల గర్భం దాల్చింది. ఆమె శరీరంలో వచ్చే మార్పులను గమనించిన తల్లి ప్రశ్నించగా వాస్తవం చెప్పింది. వెంటనే తల్లి కాచిగూడ పోలీసులకు కంప్లయింట్ చేయగా జీరో ఎఫ్ఐఆర్​ఫైల్ చేసి నేరెడ్​మెట్​పోలీసులకు బదిలీ చేశారు. దర్యాప్తు చేపట్టిన నేరెడ్​మెట్​పోలీసులు శనివారం నిందితులను అరెస్టు చేసి పోక్సో, కిడ్నాప్, లైంగికదాడి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు పంపారు.