గుట్కా తినొద్దన్నందుకు ఇంటినుంచి పారిపోయిన కూతురు..

గుట్కా తినొద్దన్నందుకు ఇంటినుంచి పారిపోయిన కూతురు..

కూతురు గుట్కా తింటుందని తెలిసి  తండ్రి కోప్పడగా… ఇంట్లో నుంచి పారిపోయింది ఆ అమ్మాయి. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. అహ్మదాబాద్ జిల్లాలోని అమ్రావతి చెందిన 15ఏండ్ల సగిరా… కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఈ మధ్యే సగిరా పదోతరగతి పరీక్షలు కూడా రాసింది. అయితే సగిరా ఒక రోజు గుట్కా తింటుండగా వాళ్ల అమ్మ చూసింది. దీంతో సగిరాను తినొద్దని కోరింది. ఈ విషయాన్ని సగిరా వాళ్ల నాన్నకు చెప్పింది. దీంతో ఇద్దరూ సగిరాను కూర్చుండ బెట్టి.. గుట్కా తింటే ఆరోగ్యం పాడవుతుందని సముదాయించారు.

ఈ విషయం జరిగిన తర్వాత సగిరా యదావిధిగా..ఇంట్లో నే గుట్కా తిన్నది. ఈ సారి వాళ్ల నాన్నకు కనపడటంతో… తీవ్ర కోపానికి గురి అయిన తండ్రి సగిరాను కొట్టాడు. దీంతో ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయింది. తల్లిదండ్రులు ఎంత వెతికినా సగిరా దొరకక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సగిర కోసం వెదుకుతున్నారు.