ప్రైమరీ హెల్త్ సెంటర్ లో 24 గంటల్లో 10 డెలివరీలు

ప్రైమరీ హెల్త్ సెంటర్ లో 24 గంటల్లో 10 డెలివరీలు

అయిజ, వెలుగు : ప్రైమరీ హెల్త్ సెంటర్ లో బుధవారం ఉదయం 10 గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు, 24 గంటల్లో 10 డెలివరీలు జరిగాయి. ఇందులో ఐదుగురు మగ పిల్లలు ఉండగా, ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు స్టాఫ్​ నర్స్​ జ్యోతి తెలిపారు.

డెలివరీల్లో రికార్డు సృష్టించడం పట్ల మెడికల్ ఆఫీసర్ విష్ణు, స్టాఫ్ నర్సులు విజయ కుమారి, శశికళ, ఎంపీహెచ్ వో ఓబులేశ్వరయ్య, భారతి ఆనందం వ్యక్తం చేశారు.