10 అడుగుల కింగ్ కోబ్రా.. రైలు నుంచి బయటకు తీశారు

10 అడుగుల కింగ్ కోబ్రా.. రైలు నుంచి బయటకు తీశారు

స్టేషన్ లో ఆగిఉన్న రైలు కు 10 అడుగుల పొడవున్న పాము చుట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లోని ఖాట్గోడమ్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనను ‘పీఎం ధాకటే’ అనే డాక్టర్ తన ఫేస్ బుక్, ట్విటర్ లో షేర్ చేశాడు.  ఎలా వచ్చిందో తెలియదు గానీ  పొడువాటి కింగ్ కోబ్రా ఆ రైలు చక్రం పై భాగంలో ఓ బాక్స్ కు చుట్టుకొని ఉంది. ఇది గమనించిన ఉత్తరాఖండ్ అటవీ శాఖ అధికారులు ,  రైల్వే ప్రొటెకషన్ ఫోర్స్ అధికారులు రెస్క్యూ టీం సహాయంతో ఆ పామును బయటికి లాగారు. పది అడుగులు పామును బయటికి లాగుతున్న ఆ వీడియో చూస్తుంటే వెన్నులో వణకుపుట్టేలా ఉంది. శనివారం పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 5000 వేల మంది చూశారు. మరి మీరూ ఓ లుక్కేయండి.