బంగారు గని బ్లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఘటనలో 10 మంది మృతి

బంగారు గని బ్లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఘటనలో 10 మంది మృతి

మరో కార్మికుడు ఇప్పటికీ మిస్సింగ్​

బీజింగ్‌‌‌‌‌‌‌‌: చైనాలోని బంగారు గనిలో జరిగిన బ్లాస్ట్‌‌‌‌‌‌‌‌లో 10 మంది మృతి చెందినట్టు అక్కడి ఎమర్జెన్సీ టాస్క్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ అధికారులు వెల్లడించారు. వాళ్ల డెడ్‌‌‌‌‌‌‌‌బాడీలను గుర్తించినట్టు సోమవారం తెలిపారు. మరొకరి ఆచూకీ ఇంకా తెలియరాలేదన్నారు. షాండొంగ్‌‌‌‌‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని క్విక్సియా సిటీలో ఉన్న గోల్డ్‌‌‌‌‌‌‌‌ మైన్‌‌‌‌‌‌‌‌లో జనవరి 10న పేలుడు జరగడంతో 22 మంది వర్కర్లు లోపల చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన 2 వారాల తర్వాత 11 మందిని కాపాడారు. మిగిలిన వారి కోసం సెర్చ్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టారు. తాజాగా 10 మంది డెడ్‌‌‌‌‌‌‌‌బాడీలను గుర్తించారు. మరో మైనర్‌‌‌‌‌‌‌‌ కోసం వెదుకుతున్నారు.

For More News..

కీళ్ల నొప్పులతో ఇబ్బందా? అయితే ఇలా చేసి చూడండి..

తిరంగా చీరకు తెగ డిమాండ్

ఒక్క మెసేజ్​తో రూ. 42 లక్షలు కొట్టేసిండు

స్కూల్ వంటమనిషికి పద్మశ్రీ అవార్డ్