కడప జిల్లాలో పేలుడు..10 మంది మృతి

V6 Velugu Posted on May 08, 2021

కడప : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలంలో మామిళ్లపల్లె గ్రామ శివారులో ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ముగ్గురాళ్ల గనిలో ఉన్న 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలను వినియోగించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు కిలోమీటర్ పరిధిలో మృతదేహాలు చెల్లాచెదురై పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని స్థానిక హాస్పిటల్ తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కడపలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. విషయం తెలిసిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Tagged POLICE, andhrapradesh, killed, Blast, , Kadapa district

Latest Videos

Subscribe Now

More News