తెలంగాణలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు

తెలంగాణలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు

తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెంచామన్నారు డీహెచ్ డాక్టర్  శ్రీనివాస్ రావు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 52,933  టెస్ట్ లు చేశామన్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య ఇప్పటి వరకు 10 లక్షలు(10,21,054)దాటిందన్నారు.  సెప్టెంబర్ చివరి వరకు కరోనా పూర్తిగా  కంట్రోల్ అవుతుందన్నారు. 42 హాస్పిటల్స్ లో 20,392 బెడ్స్ ఉండగా.. ఇందులో 18 వేలకు పైగా బెడ్స్ ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రైవేట్ లో  4131 బెడ్స్ ఉన్నాయని.. ఇందులో 50 శాతం బెడ్స్ ఇతర రాష్ట్రాల వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్నారు.

వర్షాలు ఎక్కువ పడుతుండడంతో సీజనల్  వ్యాధులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. సీజనల్, కరోనా సిమ్ టమ్స్ ఒకటే కాబట్టి  కరోనా టెస్ట్  కచ్చితంగా చేయించుకోవాలన్నారు.  ఆరు నెలలుగా కరోనాపై అలుపెరగని యుద్ధం చేస్తున్నామన్నారు. రెండు వేల వరకు హెల్త్ కేర్ వర్కర్స్ కరోనా బారిన పడ్డారన్నారు. వైరస్ వస్తువుల నుంచి వస్తుందని ప్రూ అవ్వలేదని.. కరోనా పేషంట్ తో కాంటాక్ట్ అయితేనే కరోనా వస్తుందన్నారు.

For More News..

హీరో సుశాంత్ శవపరీక్ష కావాలనే ఆలస్యం చేస్తున్నారు

అన్నా హజారేను తమతో కలవాలని కోరిన ఢిల్లీ బీజేపీ చీఫ్

దేశంలో 24 గంటల్లో 60,975 కరోనా కేసులు