సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే..మంత్రులు, నేతల శుభాకాంక్షలు

సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే..మంత్రులు, నేతల శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం (నవంబర్ 8) సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకాటి శ్రీహరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రికి పూలగుచ్ఛాలు అందజేసి, ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ప్రజాసేవలో మరింత విజయాలు కలగాలని ఆకాంక్షించారు.

మరోవైపు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే శక్తి కలగాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు, మంత్రులు, నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల స్నేహం, ఆశీర్వాదం ఎల్లప్పుడూ తనకు ప్రేరణగా ఉంటుందని తెలిపారు.