ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగాలా? వద్దా? .. అమెరికా పరిశోధనల్లో ఏం తేలిందంటే..!

 ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగాలా? వద్దా? .. అమెరికా పరిశోధనల్లో ఏం తేలిందంటే..!

ప్రెగ్నెన్సీకి ముందు సన్నగా ఉన్నా... లావుగా ఉన్నా... ఆ సమయంలో కచ్చితంగా బరువు పెరుగుతారనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే కొందరు తక్కువ, మరికొందరు ఎక్కువ బరువు పెరుగుతారు. అయితే తల్లి బరువు పెరిగితే, బిడ్డ ఎముకల పెరుగుదలకు మంచిదని జగమెరిగిన సత్యం. కాకపోతే ఆ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదని ఓ అధ్యయనం తేల్చింది. 

పిల్లలపై తల్లి బరువు ఏ విధంగా ఉపయోగపడలేదని తేలింది.. ఇటు సాధారణ బరువు. అటు అధిక బరువు... రెండు రకాల తల్లులపైనా ఆ అధ్యయనం చేసింది అమెరికాకు చెందిన యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్, అదంతా అసత్యమని మరో పరిశోధన తేల్చింది. 

మొదటి పరిశోధన కు భిన్నంగా ఫలితాలను వెల్లడించింది. తల్లి బరువు పెరిగితే... బిడ్డకు డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయంటోంది. అలాగే బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తే బిడ్డ ఎముకల ఆరోగ్యానికి హానికరమని కూడా చెబుతోంది ఆ రెండో అధ్యయనం. మరి ఏ అధ్యయనం కరెక్టో... ఏది తప్పో తెలియదు. ఎందుకైనా మంచిది, గర్భిణులు ఏది చేయాలన్నా డాక్టర్ పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం కదా మరి..!