సిరిసిల్ల కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇవ్వాలి

సిరిసిల్ల కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇవ్వాలి

సిరిసిల్ల: సిరిసిల్ల కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సిరిసిల్లలో మరమగ్గాల కార్మికులు, ఆసాములు నాలుగో రోజు సమ్మె చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్మికులు, ఆసాములకు రెండేళ్లకోసారి కూటీ రేట్లు పెంచాలన్నారు. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం పెంచిన రేట్లను కూలీలకు ఇవ్వాలని కోరారు. 

మరిన్ని వార్తల కోసం...

రా రైస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె

తెలంగాణను బెంగాల్‎గా మార్చొద్దు

పెట్రో రేట్ల పెరుగుదల బీజేపీ ఆడుతున్న గేమ్