రా రైస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె

రా రైస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె

రా రైస్ ఎగుమతిపై తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా స్పష్టతనిస్తలేదని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పార్లమెంటులోని మంత్రి ఛాంబర్‎లో తెలంగాణా మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. అనంతరం పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.

ఎలాంటి వివక్ష లేదు

‘‘పంజాబ్ లో మాదిరిగానే తెలంగాణలోనూ బియ్యం సేకరణ జరుగుతోంది. అన్ని రాష్ట్రాల మాదిరిగానే రా రైస్ కూడా కొంటాం. రా రైస్ ఎంత ఇస్తారనేదానిపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. మిగతా రాష్ట్రాలన్నీ స్పష్టతనిచ్చాయి. టీఆర్ఎస్ అబద్ధాలు చెబుతూ రైతులను మోసం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై ఎలాంటి వివక్ష చూపడం లేదు. రైతుల పట్ల నేతలు నిజాయితీగా ఉండాలి. కేంద్రం రైతులకు చేయాల్సింది చేస్తుంది. రైతులపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే మీ బాధ్యత నెరవేర్చండి. ముడిబియ్యం స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని తెలంగాణ లిఖిత‌పూర్వ‌కంగా వెల్ల‌డించింది. తెలంగాణ అవ‌స‌రాలు పోగా మిగిలిన ముడిబియ్యం తీసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ‌పై మాకు ఎలాంటి వివ‌క్ష లేదు. పంజాబ్ త‌ర‌హాలోనే తెలంగాణ నుంచి బియ్యం సేక‌ర‌ణ చేస్తాం. తెలంగాణ రైతుల‌ను కొంద‌రు త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం నిజాయితీతో వ్య‌వ‌హ‌రించాలి. తెలంగాణ లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చిన ఒప్పందానికి క‌ట్టుబ‌డి ఉండాలి. ధాన్యం సేక‌ర‌ణ‌పై త‌ప్పుడు ప్ర‌చారాన్నిమానుకోవాలి. ఏపీ కూడా 25ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ముడిబియ్యం ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ముడిబియ్యం సప్లై మీద ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. ఫిబ్ర‌వ‌ర 25న అన్ని రాష్ట్రాల‌ను పిలిచి, ఎవ‌రెంత ఇస్తారో అడిగాం. అన్ని రాష్ట్రాలు సమాచారం ఇచ్చినా, తెలంగాణ మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. స‌మాచారం ఇవ్వ‌కుండా రైతుల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వం. మోడీ ప్ర‌భుత్వం రైతుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంది. ఎలాంటి వివ‌క్ష లేకుండా దేశ‌మంత‌టా బియ్యం సేక‌ర‌ణ చేస్తోంది’’ అని పీయూష్ గోయల్ చెప్పారు.

For More News..

తెలంగాణను బెంగాల్‎గా మార్చొద్దు

పెట్రో రేట్ల పెరుగుదల బీజేపీ ఆడుతున్న గేమ్

ఏపీ సీఎం జగన్‎కు నాంపల్లి కోర్టు సమన్లు