చండీగఢ్ : అగ్నివీర్ లకు 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ కానిస్టేబుల్, జైలు వార్డెన్, ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు రిజర్వేషన్ వర్తింపజేయనున్నట్టు సర్కార్ తెలిపింది. వయసు సడలింపుతో పాటు ఇతర ప్రోత్సాహకాలను అందించనున్నామని చెప్పింది. బుధవారం హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ విలేకర్లతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో భర్తీ చేసే కానిస్టేబుల్
మైనింగ్ గార్డ్, ఫారెస్ట్ గార్డ్, జైలు వార్డెన్, స్పెషల్ పోలీసాఫీసర్ పోస్టుల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ కల్పిస్తాం. ఇందుకోసం నిబంధనలను తీసుకొచ్చాం. గ్రూప్–సీ, గ్రూప్–డీ పోస్టుల్లో వారికి మూడేండ్ల వయసు సడలింపు ఇస్తాం. మొదటి బ్యాచ్ అగ్నివీరులకు మాత్రం ఈ వయసు సడలింపు ఐదేండ్లు ఉంటుంది” అని తెలిపారు.
