
మార్చి 2020లో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం, షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా అక్టోబర్ 29వ తేదీలోగా స్కూళ్లలో ఫీజు చెల్లించొచ్చని ఆ శాఖ డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, సప్లిమెంటరీ స్టూడెంట్స్ మూడు సబ్జెక్టుల్లోపు ఉంటే రూ.110, ఆపై సబ్జెక్టులుంటే రూ.125 చెల్లించాలని సూచించారు. ఒకేషనల్ స్టూడెంట్స్ అదనంగా మరో రూ.60 చెల్లించాలన్నారు. రూ.50ఫైన్‌తో నవంబరు13వరకూ, రూ. 200ఫైన్‌తో 27 వరకూ రూ.500ఫైన్‌తో డిసెంబర్ 11 వరకూ ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్టు డైరెక్టర్ తెలిపారు. టెన్త్ పరీక్షలు మొదటిసారి రాసే ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంటుందని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.24వేల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20వేల లోపు ఉన్నవారు అర్హులన్నారు. అర్హత గల విద్యార్థులు ఇన్‌కం సర్టిఫికేట్‌ను హెడ్మాస్టర్‌కు ఇవ్వాలని సూచించారు.