
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ( Hrithik Roshan ) , టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Jr NTR ) కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'వార్ 2' ( War 2 ) . స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. యశ్ రాజ్ ఫిల్మ్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ మేకర్స్ అభిమానులకు అదిరిపోయే శుభవార్తను అందించారు.
ఈ మూవీలో హృతిక్, తారక్ ల కత్తుల పోరాటాలు, కార్ ఛేజ్‌లు, హ్యాండ్-టు-హ్యాండ్ పోరాటాలే కాదు.. పవర్ ఫుల్ సాంగ్ కు ఉందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. వీరి డ్యాన్స్ ఫెర్ ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది. పాట ఎలా ఉంటుందని అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. అభిమానుల అంచనాలకు అనుగుణంగా మూవీ మేకర్స్ ' దునియా సలాం అనాలి' ( Duniya Salaam Anali song ) అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో హృతిక్ , జూ.ఎన్టీఆర్ ఇద్దరూ హుషారుగా డ్యాన్స్ చేస్తూ.. అభిమానులను కనువిందుచేశారు. ఇప్పుడు ఈ ప్రోమో సాంగ్ ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఇక పూర్తి సాంగ్ వస్తే దుమ్ముదులేస్తుందంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.
దక్షిణ భారతదేశంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్, హిందీలో హృతిక్ రోషన్ కుఉన్న క్రేజ్ ఈ సినిమాను మరింత విజయాన్ని చేస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరిద్దరి కలయికతో వస్తున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతోందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ 'వార్ 2' మూవీలో హృతిక్ రోషన్ ఏజెంట్ కబీర్‌గా తన పాత్రను తిరిగి పోషించారు. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కు పరిచయమవుతూ విలన్‌గా అడుగుపెడుతున్నారు. ఈ టీజర్‌లో కత్తుల పోరాటాలు, కార్ ఛేజ్‌లు, హ్యాండ్-టు-హ్యాండ్ పోరాటాలతో కూడిన సీక్వెన్సులు ఉన్నాయి. హృతిక్ రోషన్ సరసన కియారా అద్వానీ ( Kiara Advani ) నటిస్తోంది. అయాన్ ముఖర్జీ ( Ayan Mukerji )దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తోందో చూడాలి మరి.