ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైదరాబాద్కు కేంద్ర హోం శాఖ అధికారులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైదరాబాద్కు కేంద్ర హోం శాఖ అధికారులు

హైదరాబాద్: తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. హైదరాబాద్కు గురువారం కేంద్ర హోం శాఖ అధికారులు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ చర్చించారు. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీకి హాజరుకావడం గమనార్హం. ఎస్ఐబీ, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో బండి సంజయ్ ప్రత్యేకంగా చర్చించారు.

కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ను ఎక్కువ సార్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వాటికి సంబంధించి సేకరించిన ఆధారాలను కేంద్ర నిఘా వర్గాలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందుంచాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయే కావడం గమనార్హం. ఈ క్రమంలో.. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అనేక ఆధారాలను కేంద్ర మంత్రి సేకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ శుక్రవారం సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు. ఈ విచారణ సందర్భంగా పలు ఆధారాలను సమర్పించనున్నారు.