
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కస్టమర్ల కల నెరవేరనుంది. మార్కెట్లో ఇప్పటికే చాల కంపెనీలు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటీలని లాంచ్ చేయగా ద్విచక్ర వాహనాల్లో సామాన్యుడికి నమ్మకమైన బ్రాండ్ గా పేరుపొందిన హోండా కంపెనీ ఎన్నో ఏళ్ల తరువాత చివరికి ఒక కొత్త ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేయనుంది.
ఈ బైక్ సాధారణ బైక్ కాదు, మొట్టమొదటి హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్. దీనికి సంబంధించి ఫోటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైల్ అవుతున్నాయి. ఫోటోలలో హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లుక్ ఎలా ఉంటుందో చూడొచ్చు అలాగే స్టైలింగ్ చూస్తే ఇంతకుముందు ఉన్న EV ఫన్ కాన్సెప్ట్ నుండి వచ్చినట్లు కనిపిస్తున్నాయి.
త్వరలోనే లాంచ్ : హోండా EV ఫన్ కాన్సెప్ట్ 500 ccకి సమానమైన ఈ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ దాదాపు 50 bhp, అదే హై టార్క్ అందిస్తుంది.
ఫోటోల ప్రకారం LED DRL, బార్-ఎండ్ మిర్రర్స్, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్స్, పెద్ద TFT స్క్రీన్ ఇచ్చారు. ఈ బైక్ స్ట్రీట్-నేక్డ్ గా, కొంచెం స్పోర్టి రైడింగ్ పోజ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది, అంటే దీనికి ఎలక్ట్రిక్ కార్లలాగానే ఫాస్ట్ ఛార్జర్ ఫీచర్ ఇచ్చారు.
లాంచ్ ఎప్పుడంటే: హోండా ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి పూర్తి వివరాలు లేనప్పటికీ, ఈ-బైక్ మొదట యూరప్‌లోకి వస్తుందని, ఆ తర్వాత ఇతర మార్కెట్లలోకి వస్తుందని చెబుతున్నారు. ఇండియాలో లాంచ్ ఎప్పుడు అనేది చెప్పలేదు. హోండా ఈ-బైక్ అల్ట్రావయోలెట్ F77కి పోటీగా వస్తుంది. పూర్తి వివరాలు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.