TGSRTC ఉద్యోగాలకు అప్లై చేసేవారు ఇది తెలుసుకోండి: లేదంటే నిలువునా మోసపోతారు..!

TGSRTC ఉద్యోగాలకు అప్లై చేసేవారు ఇది తెలుసుకోండి: లేదంటే నిలువునా మోసపోతారు..!

హైదరాబాద్: ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులకు ఉద్యోగం ఆశ చూపి డబ్బులు దండుకుంటున్నారు. దళారుల చేతిలో మోసపోయిన కొందరు బాధితులు విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో టీజీఎస్‎ఆర్టీసీ అప్రమత్తమైంది. ఈ మేరకు అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది.

టీజీఎస్‎ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు తమకు దృష్టికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3038 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. 

నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుంది. అడ్డదారుల్లో ఎవరికి కూడా ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో ఎవరైనా మిమ్మల్ని  సంప్రదిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చి స్థానిక పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం అభ్యర్థులకు సూచించింది.