కూర్చున్నోడు కూర్చున్నట్లే కూలిపోయాడు.. హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది మృతి

కూర్చున్నోడు కూర్చున్నట్లే కూలిపోయాడు.. హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది మృతి

గెండె పోటు మరణాలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. వయసుతో సంబంధం లేకుండా యువత నుంచి వృద్ధుల వరకు ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోతున్నారు. గురువారం (ఆగస్టు 07) హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాది గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కూర్చు్న్న వ్యక్తి కూర్చున్నట్లే కూలి పోవడంతో తోటి న్యాయవాదులు సీపీఆర్ చేసినా లాభం లేకుండా పోయింది. 

గురువారం హైకోర్టులో మధ్యాహ్నం 2.15 గంటలకు అందరూ చూస్తుండగా కుర్చీలో కూర్చున్న వ్యక్తి అలాగే కూలిపోయాడు. మాజీ స్పెషల్ జీపీ (Ex Special Government Pleader) ,  పర్సా అనంత నాగేశ్వర్ రావు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. విధుల్లో భాగంగా కోర్టుకు వచ్చిన నాగేశ్వర్ రావు.. అందరితో పాటు కుర్చీలో కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తి అలాగే పక్కకు ఒరిగిపోవడంతో అక్కడ ఉన్న న్యాయవాదులు గుర్తించి అందిరినీ పిలిచారు. 

నాగేశ్వర్ రావుకు గుండెపోటుకు గురైనట్లు గుర్తించి వెంటనే సీపీఆర్ చేసి ఆసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. నాగేశ్వర్ చాలా కష్టపడి పైకి వచ్చాడని.. ఎదుగుతున్న న్యాయవాది ఈ విధంగా గుండె పోటుతో చనిపోవడం చాల బాధాకరమని సాటి న్యాయవాదులు  చెబుతున్నారు. 

హైకోర్టులో గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఫిబ్రవరి 18న 21వ కోర్టు హాలులో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తూ అడ్వకేట్‌‌ పసునూరు వేణుగోపాలరావు గుండెపోటుతో కుప్పకూలిపోయారు.