ఈసెట్​లో 10 వేల 454 మందికి సీట్లు

ఈసెట్​లో 10 వేల 454 మందికి సీట్లు

 హైదరాబాద్, వెలుగు: లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కాలేజీల్లో సెకండియర్​లో10,454 మందికి సీట్లను అధికారులు కేటాయించారు. ఆదివారం ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. సీట్లు పొందిన స్టూడెంట్స్ ఈ నెల 23లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని  169 ఇంజినీరింగ్ కాలేజీల్లో 12,785 సీట్లుంటే, వాటిలో 10,407 మందికి సీట్లు అలాటయ్యాయి. 

121 బీఫార్మసీ కాలేజీల్లో 1,180 సీట్లుండగా, కేవలం 47 మందికి సీట్లు కేటాయించారు. బీటెక్, బీఫార్మసీలో ఇంకా 3,511  సీట్లు  ఖాళీగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్​లోనూ సీఎస్​ఈలోనే ఎక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. సీఎస్ఈ, ఐటీ రిలేటెడ్ కోర్సుల్లో 6,084 మంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ర్టికల్ కోర్సుల్లో 2,768 మంది, సివిల్, మెకానికల్​లో 1,376 మంది చేరారు.