దేశంలోని టాప్ 10 గ్రామాల వివ‌‌రాలు

దేశంలోని టాప్ 10 గ్రామాల వివ‌‌రాలు

హైదరాబాద్, వెలుగు: సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన ర్యాంకింగ్ లో తెలంగాణకు చెందిన 10 గ్రామాలు దేశంలో టాప్ 10 ప్లేస్ లో నిలిచాయి. ఈ గ్రామాల లిస్ట్ ను కేంద్ర పంచాయ‌‌తీరాజ్‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన వెబ్ సైట్ లో వెల్లడించింది. టాప్ 25 గ్రామాల్లో 23 తెలంగాణ గ్రామాలే ఉన్నాయి. ఎంపీలు త‌‌మ నియోజ‌‌క‌‌వ‌‌ర్గాలు, దేశంలోని ఏవైనా గ్రామాలు ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసే విధంగా రూపొందించిన ప‌‌థ‌‌క‌‌మే స‌‌ంసద్ ఆద‌‌ర్శ్ గ్రామీణ యోజ‌‌న. ఈ ప‌‌థ‌‌కం కింద ఎంపీలు ఎంపిక చేసుకున్న గ్రామాల అభివృద్ధిని మ‌‌దింపు చేసి కేంద్ర పంచాయ‌‌తీరాజ్‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ గ్రామాల‌‌ను ఎంపిక చేస్తుంది.  ఇప్పటికే స్వచ్ఛ, ఈ పంచాయ‌‌తీ, ఈ ఆడిటింగ్‌‌, బ‌‌హిరంగ మ‌‌లవిస‌‌ర్జన ర‌‌హిత (ఓడీఎఫ్‌‌) వంటి అనేక అంశాల్లో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు దేశానికే ఆద‌‌ర్శంగా నిలిచాయి.  టాప్ 25 లో 12 ప్లేస్ లో గుజరాత్ , 22 వ ప్లేస్ ఒడిశాకు చెందిన గ్రామాలు ఉన్నాయి.  రాష్ట్ర గ్రామాలకు టాప్​ర్యాంక్ రావడంపై పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ‘పల్లె ప్రగతి’ వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు.

దేశంలోని టాప్ 10 గ్రామాల వివ‌‌రాలు

  •     రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెల్లి (స్కోర్ 93.54)
  •     యాదాద్రి జిల్లా వ‌‌డ‌‌ప‌‌ర్తి (92.17)
  •     క‌‌రీంన‌‌గ‌‌ర్ జిల్లా చిగురుమామిడి మండ‌‌లం కొండాపూర్ (91.7)
  •     నిజామాబాద్ జిల్లా ప‌‌ల్డా (90.95)
  •     క‌‌రీంన‌‌గ‌‌ర్ జిల్లా వీణవంక మండ‌‌లం రామ‌‌కృష్ణాపూర్ (90.94)
  •     యాదాద్రి భువ‌‌న‌‌గిరి జిల్లా ఆలేరు మండ‌‌లం కొల‌‌నుపాక (90.57)
  •     నిజామాబాద్ జిల్లా నందిపేట మండ‌‌లం వెల్మాల (90.49)
  •     జ‌‌గిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండ‌‌లం మూలరాంపూర్ (90.47)
  •     నిజామాబాద్ జిల్లా తానాకుర్దు (90.3)
  •     నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండ‌‌లం కుక్‌‌నూర్  (90.28)

కేసీఆర్​ విజన్​ వల్లే సాధ్యమైంది: కేటీఆర్​

దేశంలోనే టాప్‌‌ 10 ఆదర్శ గ్రామాలు రాష్ట్రంలోనే ఉండడం కేసీఆర్​ విజన్​తోనే సాధ్యమైందని కేటీఆర్​ అన్నారు.  దేశంలోని టాప్‌‌ 20 గ్రామాలకు ర్యాంకింగ్‌‌లు ఇస్తే అందులో 19 గ్రామాలు రాష్ట్రానివే కావడం గర్వకారణమన్నారు.