పదేండ్ల పిల్లలకూ ఫేస్​బుక్​

 పదేండ్ల పిల్లలకూ ఫేస్​బుక్​
  • 41.30 శాతం పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్
  • చాటింగ్ కోసమే 59 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగం
  • నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ స్టడీలో వెల్లడి

పిల్లలు స్మార్ట్ ఫోన్లు వదలట్లేదు. ఆన్​లైన్ ​క్లాసుల కోసమని పేరెంట్స్ ​పిల్లల చేతికి స్మార్ట్ ​ఫోన్లు ఇస్తే.. వాళ్లు ఫేస్​బుక్, వాట్సాప్, ఇన్​స్టా, ట్విట్టర్​ అంటూ సోషల్​ మీడియాను తెగ వాడేస్తున్నారు. పట్టుమని పదేండ్లు నిండని పిల్లలకు ఫేస్​బుక్ ​అకౌంట్ ​ఉంటోంది. రాష్ట్రంలో 41.30 శాతం పిల్లలు ఫేస్​బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్ చాట్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్​లో యాక్టివ్​గా ఉంటున్నట్లు ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లు వదలడం లేదు. ఆన్​లైన్​క్లాసుల కోసమని పేరెంట్స్​పిల్లలకు స్మార్ట్​ఫోన్లు చేతికిస్తే.. వాళ్లు ఫేస్​బుక్, వాట్సాప్, ఇన్​స్టా, ట్విట్టర్​అంటూ సోషల్​మీడియాను తెగ వాడేస్తున్నారు. పట్టుమని పదేండ్లు నిండని పిల్లలు ఫేస్​బుక్ ​అకౌంట్​ఉంటోంది. రాష్ట్రంలో 41.30 శాతం పిల్లలు ఫేస్​బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్ చాట్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్​లో యాక్టివ్ గా ఉంటున్నట్లు ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 59.2 శాతం మంది పిల్లలు స్మార్ట్ ఫోన్లను కేవలం మెసేజింగ్ కోసం ఉపయోగిస్తుండగా, 10.1 శాతం మంది మాత్రమే ఆన్​లైన్ లర్నింగ్ కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడైంది.

పదేళ్ల వయసున్న చిన్నారుల్లో..
ఎన్సీపీసీఆర్ తెలంగాణతోపాటు ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న స్కూల్ స్టూడెంట్స్​పై అధ్యయనం చేసింది. అన్ని ఏజ్ గ్రూపుల(8 నుంచి 18 ఏళ్లు) పిల్లలను పరిశీలిస్తే 30.2 శాతం మంది సొంత స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నారు. పదేళ్ల పిల్లల్లో 37.8 శాతం మందికి ఫేస్‌‌బుక్ అకౌంట్ ఉంది. రాష్ట్రంలో 37.10 మంది పిల్లలకు ఫేస్‌‌బుక్ అకౌంట్ ఉండగా, 43.50 శాతం మందికి ఇన్​స్టాగ్రామ్, 10.80 శాతం మందికి వాట్సాప్, 2.30 శాతం మంది పిల్లలకు స్నాప్ చాట్, 2.30 మందికి ట్విట్టర్, 29.10 శాతం మందికి ఇతర సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నట్లు ఎన్సీపీసీఆర్ స్టడీలో తేలింది. 13 ఏళ్లు దాటిన చిన్నారుల్లో ఈ ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.  

పిల్లల్లో నిద్రలేమి సమస్య.. 
మొబైల్ వాడకంతో నిద్ర లేమి, ఆందోళన, అలసట వంటి సమస్యలు పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు ఈ స్టడీలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 72.70 శాతం మంది ఉపాధ్యాయులకు కరోనాకు ముందు స్మార్ట్ ఫోన్లను ఉపయోగించిన అనుభవం లేదని అధ్యయనంలో తెలిసింది. 

కంటి చూపు సమస్యలు..
కరోనా వల్ల ఆన్ లైన్ క్లాసులు తప్పనిసరి అయ్యాయి. పిల్లలు క్లాసులతోపాటు ఆన్ లైన్ గేమ్స్ ఆడేందుకు, సోషల్ మీడియా వినియోగం కోసం స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు. రోజులో 12 గంటలు ఫోన్లకే అడిక్ట్ అయిన పిల్లలు చాలా మంది ఉంటున్నారు. కంటి చూపు సమస్యతో హాస్పిటల్​కు వస్తున్న చిన్నారుల సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి 50 శాతం పెరిగింది. స్క్రీన్ టైం తగ్గించేందుకు పేరేంట్స్ ప్రయత్నించాలి. 
- డాక్టర్ ప్రవీణ్ కుమార్, కాకతీయ ఐ హాస్పిటల్, హన్మకొండ