గూగుల్ డౌట్స్​కి వెయ్యి రూపాయల ఫీజు

గూగుల్ డౌట్స్​కి వెయ్యి రూపాయల ఫీజు

ఒళ్లు కాస్త వేడెక్కినా... జలుబు చేసినా... దగ్గొచ్చినా.. వెంటనే గూగుల్​ సెర్చ్​ ఇంజిన్​లోకి వెళ్లి వెతుకుతుంటారు. సింప్టమ్స్​ని బట్టి ఎవరికి వాళ్లే ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలి? ఏం జబ్బు చేసిందనే విషయాలు డిసైడ్​​ అవుతారు. ఆ తర్వాత ఎప్పుడో కాని డాక్టర్​​ని కలవరు. గూగుల్​ డౌట్స్​తో డాక్టర్స్ ని విసిగిస్తుంటారు కూడా. ఇదంతా చూసి ఓ డాక్టర్​కి చిర్రెత్తుకొచ్చింది. దాంతో తన హాస్పిటల్​ బయట  ఓ నోటీస్​ బోర్డు పెట్టాడు.. అందులో ఓపిడి ఛార్జీలు రాసుకొచ్చాడు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. 

‘‘జబ్బు ఏంటో గుర్తించి... దానికి తగ్గ ట్రీట్మెంట్.. రెండూ నేనే చేస్తే ఫీజు రెండొందల  రూపాయలు. నేను డయాగ్నస్​ చేసిన వ్యాధికి.. మీరు చెప్పిన ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఐదొందలు. గూగుల్​ డౌట్స్​కి వెయ్యి రూపాయలు.  ఒకవేళ వ్యాధిని మీరే డిసైడ్​ చేసుకుని.. నాతో ట్రీట్మెంట్ చేయించుకుంటే పదిహేనొందలు.  మీరు డయాగ్నసిస్​ చేసిన వ్యాధికి మీరు చెప్పిన ట్రీట్మెంట్​ చేయాలంటే రెండువేల రూపాయలు’’ అని రాసి, నోటీస్​ బోర్డు మీద పెట్టాడు. దీన్ని గౌరవ్​ దాల్మియా అనే అతను తన ట్విట్టర్​ అకౌంట్​లో పోస్ట్​ చేశాడు. ఫొటో కింద ‘ఈ డాక్టర్​ ముమ్మాటికి కరెక్ట్​’ అనే క్యాప్షన్​ కూడా పెట్టాడు. డాక్టర్స్​ ఫ్రస్ట్రేషన్​కి సింబాలిక్​గా ఉన్న ఈ పోస్ట్​కి వేలల్లో లైక్స్​ వస్తున్నాయి ఇప్పుడు. కానీ, ఈ డాక్టర్​ జాడ మాత్రం ఇంకా తెలియలేదు.