
సోషల్ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’లో లేటెస్ట్‌గా మరో కొత్త ఫీచర్ యాడ్ అయింది. గ్రూప్ వీడియో కాల్‌ను వెయ్యిమంది చూడొచ్చు. అయితే, వీడియో కాల్‌లో ముప్పై మంది మాత్రమే పార్టిసిపేట్ చేయొచ్చు. వీడియో కాల్‌లో ఉన్న యూజర్స్ తమ వీడియోను స్ట్రీమ్ చేయాలనుకుంటే వెయ్యి మంది వరకు చూసే ఛాన్స్ ఉంది ఈ ఫీచర్‌తో. త్వరలో గ్రూప్ వీడియో కాలింగ్‌లో పాల్గొనే పార్టిసిపెంట్స్ సంఖ్యను పెంచుతామని అనౌన్స్ చేసింది. టెలిగ్రామ్ 7.1 అప్‌డేట్‌లో ఈ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తోపాటు ఆటో–డిలీట్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. అంటే మెసేజ్‌లను నెల తర్వాత ఆటో మేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్ చేయొచ్చు.