టీహబ్ వార్షిక సమావేశానికి 33 దేశాల నుంచి 10వేల మంది

టీహబ్ వార్షిక సమావేశానికి 33 దేశాల నుంచి 10వేల మంది

మానవ జీవితంలో టెక్నాలజీ ఒక భాగమైపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని టీహబ్ లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వార్షిక సమావేశానికి ఆయన  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అగ్రికల్చర్, హెల్త్ కేర్, డిఫెన్స్, స్పోర్ట్స్ వంటి వివిధ రంగాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గ్రామీణ యువతకి స్కిల్స్ నేర్పిస్తూ... వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న టీటా ప్రతినిధుల్ని అభినందించారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతున్నట్ల ఆర్గనైజర్స్ తెలిపారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 33 దేశాల నుంచి 10వేల మంది పాల్గొంటున్నట్లు చెప్పారు.

For More News..

త్వరలో ఢిల్లీ హెల్త్ మినిస్టర్ అరెస్ట్?

దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ముఖేష్ అంబానీదే