
- మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో మాజీ సీఎం రోశయ్య జయంతి
మెదక్ టౌన్, వెలుగు: ప్రజా ప్రతినిధిగా కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా యువజన క్రీడలు శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్ రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమాల్లో జిల్లా అడిషనల్కలెక్టర్ నగేష్, డీఆర్వో భుజంగ రావు, డీయూఎస్వో దామోదర్ రెడ్డి, మెదక్ ఏఎస్పీ మహేందర్ సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, ఏఆర్ డీఎస్పీ రంగనాయక్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు రామచంద్రాపురం రెవెన్యూ అధికారులు శుక్రవారం ఘన నివాళ్లు అర్పించారు.
రోశయ్య 92 వ జయంతిని పురస్కరించుకొని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంగ్రామ్రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర అభివృద్ధి కోసం దివంగత సీఎం రోశయ్య చేసిన కృషి మరవలేనిదని అన్నారు. రెవెన్యూ సిబ్బంది లక్ష్మీ శ్వేత, విజయ, వినీత్, స్వప్న, శ్వేత, శ్రీకాంత్, రాములు, సంజీవ పాల్గొన్నారు.