
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ కు తమ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ఆ కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్యాంపస్ ఫూల్ డ్రైవ్ లో తమ విద్యార్థినులు అద్భుత ప్రతిభను కనబరచారన్నారు. గురువారం ఎంపిక పత్రాలను అందుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అటానమస్ హోదాను సాధించిన అనంతరం తమ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను అందించడం ద్వారా ఈ ఫలితాలు సాధించగలిగామని తెలిపారు. ఎంపికైన విద్యార్థినులను అభినందించారు. కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, ఏవీవీ శివ ప్రసాద్, జే. రవీంద్రబాబు, ఎన్. శ్రీనివాసరావు ఉన్నారు.