
- తెలంగాణసాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
మెదక్ టౌన్, వెలుగు : తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలను మెదక్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్, అడిషనల్ కలెక్టర్నాగేష్, సంఘ నాయకులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. సీపీఎం ఆధ్వర్యంలో కొమురయ్య వర్ధంతిని పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో నిర్వహించగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య కొమురయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నర్సమ్మ, మల్లేశం, ప్రవీణ్, యశోద, దుర్గ, కవిత, యాదగిరి, షౌకత్ అలీ, సత్యం, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
చేర్యాలలో
చేర్యాల, వెలుగు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 79 వర్ధంతిని చేర్యాల పట్టణంలో జరిగింది. కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సీపీఐ, సీపీఎం, కురుమ సంఘం, గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం కురుమ సంఘం రాష్ట్ర నాయకులు వెంకట్ మావో, అరుణ్ కుమార్, ఆలేటి యాదగిరి, మీస సత్యనారాయణ, అందె అశోక్, అందె నాని బాబు, రాజయ్య,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఘణంగా దొడ్డి కొమురయ్యవర్దంతి
కోహెడ, వెలుగు: కోహెడ మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య వర్దంతిని కురుమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నాయకులు శేఖర్,వెంకటేశం,లక్ష్మణ్,అశోక్,శ్రీనివాస్,సురేశ్ తదితరులు ఉన్నారు.