Thammudu Review: ‘తమ్ముడు’ రివ్యూ.. నితిన్ హిట్ కొట్టాడా? మూవీ ఎలా ఉందంటే?

Thammudu Review: ‘తమ్ముడు’ రివ్యూ.. నితిన్ హిట్ కొట్టాడా? మూవీ ఎలా ఉందంటే?

‘వకీల్ సాబ్’ తర్వాత వేణు శ్రీరామ్ తెరకెక్కించిన మూవీ ‘తమ్ముడు’. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్​ నిర్మించిన ఈ సినిమా నేడు (జులై 4న) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కాంతారా ఫేమ్' సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటించారు. సీనియర్ నటి లయ కీలక పాత్ర పోషించింది. ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన తమ్ముడు ఎలా ఉంది? నితిన్ ఈ సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడా? లేదా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. 

తమ్ముడు కథ:

ఆర్చరీలో గోల్డ్ మెడల్ కొట్టాలన్నది జై (నితిన్) లక్ష్యం. కానీ చిన్నప్పుడు తను చేసిన తప్పు వల్ల అక్క ఝాన్సీ (లయ) దూరం అయిందనే గిల్ట్తో టార్గెట్పై ఫోకస్ పెట్టలేకపోతాడు. దీంతో చిత్ర (వర్ష బొల్లమ్మ) తో కలిసి అక్కను వెతుక్కుంటూ వైజాక్ వెళ్తాడు. ఆమెతో "తమ్ముడు" అని పిలిపించుకోవాలి అనుకుంటాడు. ఆంధ్రా, ఛత్తీస్ గడ్ బోర్డర్ లోని అడవిలో ఉన్న అంబర గొడుగులో అమ్మవారి మొక్కు చెల్లించుకునేందుకు ఆమె ఫ్యామిలీతో కలిసి వెళ్తుంది.

ALSO READ : అల్లు అరవింద్ ను ప్రశ్నించిన ఈడీ.. బ్యాంకు స్కాం కేసులో విచారణ

గవర్నమెంట్ ఆఫీసర్ అయిన ఆమెను కుటుంబంతో సహా చంపేందుకు పారిశ్రామిక వేత్త అజర్వాల్ (సౌరబ్ సచదేవ్) మనుషులు వెంట పడుతుంటారు. వాళ్ళు ఎందుకు తనను చంపాలి అనుకున్నారు? వాళ్ల నుండి తన అక్క కుటుంబాన్ని జై ఎలా కాపాడుకున్నాడు.?ఇందుకు రత్న (సప్తమి గౌడ) ఎలా సహాయపడింది? ఇందులో గుత్తి (స్వసిక) పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే:

తమ్ముడు మూవీ.. బ్రదర్ అండ్  సిస్టర్ సెంటిమెంట్‌‌‌‌ బేస్ చేసుకుని తెరకెక్కింది. అక్కాత‌మ్ముళ్ల అనుబంధానికి యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్ ఎలిమెంట్స్ జోడించి మ‌ల్టీజాన‌ర్ మూవీగా రూపొందించాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఈ  కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌తో పాటు డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. గతంలో భోపాల్, వైజాగ్ తదితర ప్రదేశాల్లో జరిగిన గ్యాస్ లీక్ సంఘటనల్ని తమ్ముడుతో చూపించారు.

అయితే, ఈ అంశాలన్నీ ‘‘ఓ న్యూస్ ఆర్టికల్ స్ఫూరితో  ‘తమ్ముడు’ కథను సిద్ధం చేసుకున్నట్లు.. హీరోతో పాటు ఐదుగురు ఉమెన్ క్యారెక్టర్స్ బలంగా ఉంటాయని ’’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేణు చెప్పుకొచ్చాడు. అయితే, ‘తమ్ముడు’ కథను మాత్రం పేపర్‌పై కనిపించినంత ఎమోషనల్.. తెరపై పండించలేకపోయారు. నిజానికి ఒకే సినిమాలో ఇన్నేసి కోణాలను చూపించాలనుకోవడం కాస్త సాహసమైన నిర్ణయమే. ఈ విషయంలో వేణుని మెచ్చుకోవొచ్చు. కానీ, ఇంకాస్తా బలంగా ప్రెజెంట్ చేసుంటే.. సినిమా స్థాయి పెరిగేది. 

ఫస్టాఫ్ క్యారెక్ట‌ర్ల‌ను బిల్డ్ చేసుకోవడం, అక్కను వెతుక్కుంటూ అడవికి వెళ్లడంతోనే సాగుతుంది. సెకండాఫ్ మొత్తం అంబ‌ర‌గొడుగు అనే ప్రాంతం చుట్టూ సాగుతుంది. అక్క అనుకోకుండా ఆ ఊరికి వెళ్లడం.. అక్కడ ఆమె కొన్ని సమస్యలలో ఇరుక్కోవడం.. ప్రజలకు ఇచ్చిన మాట తీర్చకుండా ఉండడం.. ఇక ఆపై తమ్ముడొచ్చి అక్క మాట కోసం నిలబడడం.. తీరా అదే ఊరికి వచ్చి ఆమె ఆశయాన్ని ఎలా తీర్చడం.. వంటి అంశాలన్నీ ఇప్పటికే చాలా సినిమాలలో చూశారు ప్రేక్షకులు.

ఈ ఎపిసోడ్‌లో ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ కాక‌పోయినా యాక్ష‌న్ సీక్వెన్స్‌లు మాత్రం బాగున్నాయి. అయితే ఆ ట్రాక్ మొత్తం సహజత్వానికి దూరంగా సాగిపోతుంది.. సినిమాలో ఆకట్టుకునే విషయం ఏదైనా ఉందంటే.. అది విలన్ పాత్ర అని చెప్పొచ్చు. అలాగే, సౌండ్ డిజైన్, విజువల్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. 

ఎవరెలా నటించారంటే?

చాలా కాలం తర్వాత నితిన్ ఒక మంచి క్యారెక్టర్లో నటించాడు. జై పాత్ర‌లో ఎమోషన్ అండ్ యాక్ష‌న్ సీక్వెన్‌ల‌లో మెప్పించాడు. లయ రీ ఎంట్రీతో ఆకట్టుకుంది. జాన్సీ పాత్రకు న్యాయం చేసింది. హీరో అక్కగా నటించి తన పాత్రకు ప్రాణం పోసింది. స్వస్తిక విజయ్ లేడీ విలన్ గా శభాష్ అనిపించుకుంది. మరో విలన్ బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్ దేవ్ తన పాత్రతో సినిమాకు హై ఇంపాక్ట్ ఇచ్చాడు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.