
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్( ED ) విచారణ ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ రోజు ( జులై 4 వ తేదీన) సుమారు మూడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది. అయితే ED విచారించాల్సినంత తప్పు ఆయన ఏం చేశారన్నది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
ALSO READ : ‘ఉప్పు కప్పురంబు’ రివ్యూ.. సెటైరికల్ కథతో సుహాస్, కీర్తి సురేష్..
యూనియన్ బ్యాంకు నుంచి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ 2018-19 మధ్య సుమారు రూ. 101 కోట్ల రుణాలను తీసుకుంది. అయితే తీసుకున్న ఈ రూ. 101 కోట్ల రూపాయల అప్పును రామకృష్ణ ఎలక్ట్రికల్స్ తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఇది పెద్దమొత్తంలో బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం కావడంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈడీ తన దర్యాప్తులో బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రామకృష్ట ఎలక్ట్రానిక్స్ సంస్థకు నుంచి అల్లు అరవింద్ కు చెందని అల్లు సంస్థల మధ్య లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది.
ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నోటీసులు అందుకున్న ఆయన జులై 4వ తేదీన హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసుకు హాజరయ్యారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన రామకృష్ణా ఎలక్ట్రానిక్స్ సంస్థలో జరిపిన లావాదేవీలపై అల్లు అరవింద్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇది పూర్తిగా సినీ వ్యాపారానికి సంబంధించినవని వివరించారు. ఆ సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలేనని అధికారులకు తెలిపారు. అల్లు అరవింద్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన ఈడీ అధికారులు .. అవసరం అయితే మళ్లీ విచారణ హాజరుకావాలని ఆదేశించింది.