
ఎల్లారెడ్డిపేట, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకొని ఫైన్ వేశారు. తహసీల్దార్ సుజాత వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచి శుక్రవారం ఉదయం 10గంటలకు 33 ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఉదయం 6 గంటలకే వెళ్లి ఇసుకను సర్దాపూర్‌కు తరలిస్తున్నారని కలెక్టర్ కార్యాలయానికి రైతులు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో ఆర్ఐ శ్రవణ్ రీచ్‌కు వెళ్లి చూడగా.. ఇసుక లోడ్‌చేసి ఉన్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు. వాటిని తహసీల్ ఆఫీస్‌కు తరలించి ఒక్కో ట్రాక్టర్ కు రూ.5 వేలు ఫైన్ వేసినట్లు చెప్పారు.
లారీ, ట్రాక్టర్ పట్టివేత
కోరుట్ల, వెలుగు: మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీ, వెల్లుల్ల గ్రామంలో ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.