
కరకగూడెం, వెలుగు : మండలంలోని చొప్పాల గ్రామానికి చెందిన ఓ బాలుడు కూల్డ్రింక్ అనుకొని గడ్డిమందు తాగిన విషయం తెలిసిందే. ఆ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. గ్రామానికి చెందిన జాడి నవీన్, వరలక్ష్మి దంపతుల కుమారుడు వరుణ్ తేజ్(4) గత ఆదివారం ఇంట్లో ఆడుకుంటూ థమ్స్అప్ బాటిల్లో నిలువ చేసిన గడ్డి మందును కూల్ డ్రింక్ అనుకొని తాగడు.
వెంటనే అస్వస్థతకు గురైతన బాలుడిని గమనించి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో కరకగూడెం, ఖమ్మంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం వరణ్ తేజ్ చనిపోయాడు.