108, 104, ఈఎస్ఐ ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా

108, 104, ఈఎస్ఐ ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా

హైదరాబాద్ : 108 ఉద్యోగుల సేవలు ఎంతో గొప్పవన్నారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణ భవన్ లో జరిగిన 108 ఉద్యోగుల రెండవ మహాసభలో ఈటల పాల్గొన్నారు. కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ మూసివేసినప్పటికీ వైద్యశాఖలో పని చేసే ఉద్యోగులు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. 12 గంటల పని విధానం, జీత భత్యాలు, APFపై త్వరలోనే పూర్తి స్థాయిలో మాట్లాడతామన్నారు. 108 ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే చర్చించామన్నారు ఈటల. సబ్ కమిటీ నివేదిక సీఎంకు అందించాక అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. 12 గంటల పని విధానం సరైంది  కాదన్నారు 108 ఉద్యోగులు. పాత పని విధానాన్ని కొనసాగించాలని ఈటలను కోరారు.