- హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నాలుగు జోన్లకు ఒక కార్పొరేషన్
- ఎన్నికల కోసం ఓటర్ల జాబితా
- తేల్చే పనిలో నిమగ్నం
- మే లేదా జూన్లో నోటిఫికేషన్
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ విస్తరణతో పాటు వార్డుల పునర్విభజనపై ఫైనల్నోటిఫికేన్ విడుదల చేసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు కార్పొరేషన్ల విభజనపై పడింది. 300 వార్డులు,60, సర్కిల్స్, 12 జోన్లతో ఏర్పాటైన మెగా సిటీని మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి10తో ముగియనుండటంతో ఆ తర్వాతే విభజన ప్రక్రియపై స్పష్టత వచ్చే ఛాన్స్ఉంది. జీహెచ్ఎంసీని సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లుగా మార్చే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల పనిలోనూ..
ప్రస్తుత కౌన్సిల్ గడువు కూడా ముగుస్తుండడంతో బల్దియా ఎన్నికల విభాగం అధికారులు ఎన్నికల సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పనపై దృష్టి పెట్టారు. ఏ జోన్ ను ఏ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలనే అంశంపైనా కసరత్తు మొదలుపెట్టారు. ఈ లెక్కన వచ్చే ఏడాది మే లేదా జూన్ లో ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణ, విభజన ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఎన్నికలకు వెళ్తామని, ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆరునెలలు పడుతుందని, తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటున్నారు.
1.34 కోట్లకు చేరిన గ్రేటర్ జనాభా
మూడు కార్పొరేషన్లుగా విభజిస్తే ప్రస్తుతమున్న 12 జోన్లలో నాలుగు జోన్లకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశముంది. సికింద్రాబాద్, హైదరాబాద్,సైబరాబాద్ మూడు కార్పొరేషన్లుగా విభజించే ఛాన్స్ ఉంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో సికింద్రాబాద్ కార్పొరేషన్ .., చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ జోన్లతో హైదరాబాద్.. , కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ జోన్లు కలిపి సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విస్తరణ తర్వాత గ్రేటర్ జనాభా 1.34 కోట్లకు చేరింది. 10లక్షల జనాభా దాటితేనే గ్రేటర్ సిటీగా పరిగణిస్తారు. ఇలా మూడు కార్పొరేషన్లు కూడా గ్రేటర్ సిటీలుగానే
ఉండనున్నాయి.
