సీపీఆర్​తో పాణం పోసిండు.. యువకుడిని కాపాడిన 108 సిబ్బంది

సీపీఆర్​తో పాణం పోసిండు.. యువకుడిని కాపాడిన 108 సిబ్బంది

కొండపాక (కొమురవెల్లి), వెలుగు: ‘సీపీఆర్’​తో 108 సిబ్బంది ఓ యువకుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.  కుకునూర్ పల్లి  మండలం చిన్నకిష్టాపూర్ గ్రామానికి చెందిన  పర్వతం రాజు (28) ఆటో నడుపుతూ చిన్నకిష్టాపూర్​ నుంచి కుకునూర్ పల్లికి వస్తున్నాడు. దారిలో  ఆకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అటుగా వెళ్తున్న కరణ్ రెడ్డి అనే వ్యక్తి 108కి సమాచారం అందించాడు.

సిబ్బంది బైండ్ల మహేందర్,  పైలెట్ పంజాల రమేశ్​ ఘటనా స్థలానికి చేరుకున్నారు.  రాజును పరీక్షించి అతడి గుండె సరిగా కొట్టుకోవడం లేదని గుర్తించారు. వెంటనే  మెడికల్ టెక్నీషియన్ మహేందర్ సీపీఆర్​ చేశారు. దీంతో రాజు గుండె  తిరిగి కొట్టుకోవడం ప్రారంభమయింది. అనంతరం రాజును గజ్వేల్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  అత్యవసర స్థితిలో త్వరగా స్పందించినందుకు మెడికల్  టెక్నీషియన్​ మహేందర్,  పైలెట్ రమేశ్​ను పలువురు అభినందించారు.