
- లిమ్కా బుక్ ఆఫ్రికార్డ్ సాధించిన నిజామాబాద్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య
నిజామాబాద్, వెలుగు: 14.45 నిమిషాల్లో108 సూర్య నమస్కారాలు చేసి నిజామాబాద్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్బస్వా లక్ష్మీనర్సయ్య రికార్డు సృష్టించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీనర్సయ్య లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు డెమో ప్రదర్శన ఇచ్చారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని 50 ఏండ్ల లక్నో వాసి 15 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి లిమ్కా బుక్‌ఆఫ్‌రికార్డ్స్లో చోటు సంపాదించారు. ఆ రికార్డును లక్ష్మీనర్సయ్య బ్రేక్చేశారు. 14 నిమిషాల 45 సెకండ్లలో108 సెట్స్ లిమ్కా బుక్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. 66 ఏళ్ల వయస్సులో17 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉండగా15 నిమిషాల్లోనే చేయడం గమనార్హం. ఈ సందర్భంగా లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ.. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక తాను నాసిక్ గురుకుల్ యోగాభ్యాస్ ఇనిస్టిట్యూట్‌లో వన్ మంత్ కోర్సు చేసినట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో కంటిన్యూ చేశానని వివరించారు. 2 నెలల కఠోర సాధనతో ఈ రికార్డు సాధ్యమైందని చెప్పారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్మాట్లాడుతూ 66 ఏండ్ల వయసులో లిమ్కా రికార్డ్ సాధించి బస్వా లక్ష్మీనర్సయ్య జిల్లా ప్రజలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు.14.45 నిమిషాల్లోనే పూర్తిచేయడం అభినందనీయం అన్నారు. యోగ మాస్టర్లు కృష్ణ, ప్రభాకర్, రమ, రణదీప్ శర్మ పాల్గొన్నారు.