
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి మంచి ఛాన్స్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ రానేవచ్చేసింది. ఎప్పటిలాగే ఈసరి కూడా అదిరిపోయే ఆఫర్లు, బంపర్ డిస్కౌంట్స్ తీసుకొచ్చింది. వీటిలో కొన్ని అద్భుతమైన అఫర్స్ గురించి మీకోసం..
ఈ అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ భారతదేశంలో జూలై 12 నుండి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సేల్ కొన్ని రోజుల ముందే ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఐఫోన్ 15 పై డిస్కౌంట్ ధరను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 2023లో లాంచ్ అయినా ఈ ఫోన్ కొనాలనుకునే సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డ్‌ల కస్టమర్‌లు ఈ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI అప్షన్స్ కూడా ఉన్నాయి.
ఐఫోన్ 15 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్లో లాంచ్ ధర రూ. 79,900 ఉండగా, బ్యాంక్ ఆఫర్‌తో సహా రూ. 57,249 లభిస్తుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ కస్టమర్లకు రూ. 52,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. నో-కాస్ట్ EMI అప్షన్ నెలకు రూ. 10,033 నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి iPhone 15 కొనే కస్టమర్లు మరో 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ ప్రస్తుతం ఐఫోన్ 15 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 69,900కు అందిస్తుంది. అలాగే 256GB స్టోరేజ్ ధర రూ. 79,900, 512GB స్టోరేజ్ ధర రూ. 99,900. ప్రస్తుతం, ఐఫోన్ 15 బేస్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 60,200కు లభిస్తుంది.
ALSO READ : గాల్లో ఎగిరే డ్రోన్ కెమెరా ఫోన్: ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వేరే లెవెల్ అంతే..
ఐఫోన్ 15తో పాటు Samsung Galaxy S24 Ultra, iQOO Neo 10R 5G, OnePlus 13sలపై కూడా అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే ఈ ప్రత్యేకమైన అఫర్ లభిస్తుంది, అది కూడా జులై 14 వరకు మాత్రమే. అంతేకాదు స్మార్ట్‌ఫోన్‌లు, ఆక్సెసోరిస్ పై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ICICI, SBI బ్యాంక్ కార్డులు ఉన్న వారు EMI ద్వారా పేమెంట్ చేస్తే మరో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, A16 బయోనిక్ చిప్, దుమ్ము ఇంకా వాటర్ రిసిస్టెంట్ కోసం IP68 రేటింగ్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 48-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 12-మెగాపిక్సెల్ షూటర్ కెమెరా కూడా ఉంది.