కూకట్ పల్లిలో కల్తీకల్లు తాగి 13 మందికి అస్వస్థత

కూకట్ పల్లిలో కల్తీకల్లు తాగి 13 మందికి అస్వస్థత

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో  కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు.  జులై 8న కల్తీకల్లు తాగిన 13 మంది వాంతులు,విరేచనాలు,లోబీపీతో బాధిలంతా కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చేరారు.  వీరిలో తొమ్మిది మంది పురుషులు, నలుగురు  మహిళలు ఉన్నారు.  ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.  

వెంటనే  ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. బాధితులంతా హైదర్ నగర్, ఎల్లమ్మబండ, తదితర ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించటం వల్ల అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. కల్తీ కల్లు వ్యవహారం కావడంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.