కాళేశ్వరం: నీటితో నిండిన లక్ష్మి బ్యారేజ్

కాళేశ్వరం: నీటితో నిండిన లక్ష్మి బ్యారేజ్

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీలో మొదటిసారిగా నీటిమట్టం దాదాపు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రానికి 16.2 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది.  దీంతో  11 మోటార్ల ద్వారా నీటిని ఎగువకు ఎత్తిపోశారు అధికారులు. గత ఏడాది నవంబరు 21 నుంచి పూర్తిస్థాయిలో లక్ష్మీ బ్యారేజీ గేట్లను మూసివేసి నీటిని నిలువ చేశారు. మళ్లీ మూడు నెలల తర్వాత పంపులు  రన్ చేసిన నీటిని ఎగువకు ఎత్తిపోసే ప్రక్రియ పట్టారు. ఇవి అన్నారం బ్యారేజ్ కి చేరుకుంటాయి.